హీరో కార్తీ తెలుగు ప్రేక్షకులకు బాగా సూపరిచితము. హీరో నటించే సినిమాలను ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటాయి. అలా తెరకెక్కించిన వాటిలో ఖైదీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. దీనికి లోకేష్ కనగరాజ్ రైటర్ మరియు దర్శకత్వం వహించారు. ఈ సినిమా మొదటి భాగం 2019 వ సంవత్సరం లో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వచ్చి.. కార్తీ కెరియర్ లోనే మంచి విజయాన్ని చేకూర్చింది.
ఇక ఈ సినిమాలో నరై న్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ ధినా కీలక పాత్రలో నటించారు. చివరిలో సీక్వెల్ ఉంచేలా బాగా ప్లాన్ చేశారు చిత్ర యూనిట్ సభ్యులు. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ లో కార్తీ, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మరియు నిర్మాత ఎస్ ఆర్ ప్రభు.. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని తెలియజేశారు. అయితే ప్రస్తుతం డైరెక్టర్ కమల్‌హాసన్‌తో కలిసి విక్రమ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఈ సినిమా సీక్వెల్ ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా 2022 వ సంవత్సరంలో మధ్యలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం కార్తి అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.