శ్రియ సరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అనతి కాలంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసన ఆడి పాడింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.
ఇక 2018లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడిన శ్రియ.. 2020లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు అర కొర సినిమాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్‌ను అలరిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా భర్తతో ముద్దుల్లో మునిగిపోయిందీ బ్యూటీ. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే శ్రియ.. తరచుగా తన భర్తతో రొమాన్స్ చేస్తూ ఆ దృశ్యాలని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా కూడా శ్రియ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
అందులో భర్తకు ఘాటుగా లిప్ కిస్సు ఇస్తూ శ్రియ కనిపించింది. దీంతో శ్రియ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరూ ఆమె పిక్స్‌పై ఓ లుక్కేసేయండి.
https://www.instagram.com/p/CYEaD_7Kuml/?utm_source=ig_web_copy_link