అర‌రే.. ఇప్పుడా క‌ష్టాలు ప‌వ‌న్‌కీ మొద‌ల‌య్యాయా?

చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ క‌ష్టాలు స‌ర్వ సాధార‌ణం. అయితే ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సైతం ఆ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తన కెరీర్‌లో తొలిసారి పవన్ కళ్యాణ్ చారిత్రక పాత్రలో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప‌వ‌న్‌కు జోడీగా రాణి పాత్ర కోసం శ్రీలంక‌న్ సుంద‌రి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను ఫైనల్ చేశారు.

కానీ, రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌తో పాటు ఆమె పాత్ర సైతం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తున్నది. దీంతో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే క్రిష్ రిస్క్ చేయ‌డం ఇష్టం లేక సినిమా నుంచి ఆమెను త‌ప్పించి.. మ‌రో హీరోయిన్‌ను వెతికే ప‌నిలో ప‌డ్డారు.

ఇప్ప‌టికే న‌ర్గీస్ ఫక్రీ, లారిస్సా బొనెసి వంటి వారిని సంప్ర‌దించ‌గా.. వారు ప‌లు కార‌ణాల చేత రిజెక్ట్ చేశార‌ని టాక్‌. దీంతో ఇప్పుడు ఏఎం ర‌త్నం, క్రిష్ అండ్ టీం.. ప‌వ‌న్ సినిమాలో హీరోయిన్‌ను వెతికే ప‌నిలో నిమ‌ఘ్న‌మై ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రి ప‌వ‌న్‌కి హీరోయిన్ ఎప్పుడు దొరుకుందో చూడాలి.

Share post:

Latest