ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కేవలం దక్షిణాది భాసల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ నటించి సక్సెస్ అయిందీ బ్యూటీ. ముఖ్యంగా గజనీ సినిమాతో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సూపర్ క్రేజ్‌ను సంపాదించుకున్న అసిన్.. డబ్బుపై ఆశతో చేతులారా తన సినీ కెరీర్‌ను నాశనం చేసుకుంది.
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు అసిన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. ఆమెను సినీ ఇండస్ట్రీకి దూరం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..భరతనాట్యంలో శిక్షణ పొందిన అసిన్.. `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నాగార్జునతో శివమణి, పవన్‌తో అన్నవరం, ప్రభాస్‌తో చక్రం, బాలయ్యతో లక్ష్మీ నరసింహా.. ఇలా తక్కువ సమయంలో స్టార్ హీరోలందరి సరసనా నటించిన ఈ బ్యూటీ..తమిళంలోనూ అజిత్, సూర్య లాంటి స్టార్ హీరోలతో జోడీ కట్టింది.
ఇక దక్షిణాదిలో స్టార్ ఇమేజ్ దక్కగానే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అసిన్.. అక్కడా బాగానే సక్సెస్ అయింది. ఎనిమిది భాషల్లో మాట్లాడగల ఈ భామ.. అన్ని భాషల్లోనూ తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకునేది. ఇక కెరీర్ దూసుకుపోతున్న తరుణంలో అసిన్.. ముంబైకి చెందిన సెలబ్రెటీ మేనేజ్మెంట్ కంపెనీతో ఓ ఒప్పందం కుదుర్చుకుంది.
ఒక సంవత్సరం పాటు ఆ కంపెనీ కోసంమే పని చేస్తానని రూ.10 కోట్లకు డీల్ సెట్ చేసుకుందట. అయితే అదే సమయంలో ఆమెకు మంచి మంచి సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ, సదరు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న కారణంగా ఒక సంవత్సరం పాలు ఏ సినిమాలనూ అసిన్ ఒప్పుకోలేదు. ఆ కారణంగానే ఆమెకు సినిమా అవకాశాలన్నీ తగ్గిపోయాయి. దాంతో సినీ ఇండస్ట్రీకి దూరమై అసిన్.. బిజినెస్‌మేన్ రాహుల్ శర్మను పెళ్లాడింది. ఈ జంటకు ఒక పాప జన్మించింది.