శ్రీయ శరన్… పరిచయం అవసరం లేని పేరు. `ఇష్టం` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సరసనా ఆడి పాడి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించిన శ్రీయ.. ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది.
తన అందం, అభినయంతో నేటికీ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా వెలిగిపోతున్న ఈ అందాల భామ.. 2018లో స్పెయిన్‌కు చెందిన ఆండ్రీని వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై పెద్దగా కనిపించని ఆమె మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలతో బిజీగా మారుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీయ తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న టాలీవుడ్ హీరోల గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది.
ఇందులో భాగంగానే ప్రభాస్ కళ్ళపై నయా కామెంట్స్ చేసింది. ప్రభాస్ గురించి శ్రియ మాట్లాడుతూ ప్రభాస్ కళ్ళు చాలా బాగుంటాయని, ఆయన కళ్ళు ఎంత సేపు చూసినా తనివి తీరవని పొగడ్తల వర్షం కురిపించింది. అలాగే పవన్ కళ్యాణ్ ఒక పుస్తకాల పురుగని, ఎన్టీఆర్ అప్పట్లో ఎంతో సైలెంట్.. ఇప్పుడు మారిపోయారని, రజనీకాంత్ ఒక పవర్ హౌస్ అని తన అభిప్రాయాన్ని తెలిపింది.
కాగా, శ్రీయ సినిమాల విషయానికి వస్తే.. `ఆర్ఆర్ఆర్` చిత్రంలో అజయ్ దేవ్గన్‌కు జోడీగా నటించి ఈ బ్యూటీ మరోవైపు `గమనం` మూవీలో కీలక పాత్రను పోషించింది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 10న విడుదల కానుంది.