భీమ్లా నాయక్ ఫోర్త్ సాంగ్.. అడవి తల్లి మాట వచ్చేసింది..!

December 4, 2021 at 10:31 am

భీమ్లా నాయక్ సినిమా నుంచి వాయిదా పడ్డ ఫోర్త్ సింగిల్ సాంగ్ ఇవాళ ఎట్టకేలకు విడుదలైంది. ఈ పాట 1 వ తేదీన విడుదల కావలసి ఉండగా సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించడంతో సాంగ్ రిలీజ్ నిలిపి వేసిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం భీమ్లా నాయక్ ఫోర్త్ సింగిల్ సాంగ్ అడవి తల్లి మాట విడుదలైంది. భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పటికి మూడు పాటలు విడుదల కాగా.. ఈ పాట వాటికి పూర్తిగా డిఫరెంట్ గా ఉంది.

ఈ మూవీ మొదటి మూడు పాటల్లో రెండు మాస్ పాటలు కాగా, ఒకటి చిత్ర పాడిన అంత ఇష్టమా.. అంటూ సాగే మెలోడీ పాట ఉంది. నాలుగవ పాట అడవి తల్లి మాట.. పూర్తిగా అడవి నేపథ్యంలో సాగుతుంది. ఈ పాటను దుర్గవ్వ, సాహితీ చాగంటి చక్కగా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

భీమ్లా నాయక్ సినిమాకు తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. అడవి తల్లి మాట సాంగ్ లో పవన్ కళ్యాణ్, రానా, నిత్యా మీనన్, సంయుక్త మీనన్, సముద్రకని పాత్రలను మరోసారి పరిచయం చేశారు. భీమ్లా నాయక్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశం నిర్మిస్తుండగా.. జనవరి 12 వ తేదీన సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

భీమ్లా నాయక్ ఫోర్త్ సాంగ్.. అడవి తల్లి మాట వచ్చేసింది..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts