సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. సొంత టాలెంట్‌తో టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగిన ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అరడజన్ సినిమాలకు పైగా చేసిన మహేష్.. రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపును పొందాడు.
ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న మహేష్ నట ప్రస్థానానికి ఇటీవలె 42 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్.. ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. `సమ్మర్ వెకేషన్ లో చైల్డ్ ఆర్టిస్ట్స్ గా సినిమాలు చేశాను. చదువు పూర్తి కాగానే నాన్న సినిమాలలోకి వచ్చేయ్ అని కోరారు.. అలా సినీ ఇండస్ట్రీలోకి వచ్చాన`ని మహేష్ చెప్పుకోవచ్చారు.
అయితే కెరీర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని పేర్కొన్న మహేష్.. తన సినిమాలను కుటుంబ సభ్యులతో కలిసి చూడడం గొప్ప అనుభూతిని ఇస్తుందని చెప్పుకొచ్చారు. కానీ, నా సినిమాలు పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం నాకుంది. ముఖ్యంగా నా సినిమాల్లో ఫైట్స్ పిల్లలకు అసలు నచ్చవు. సితార అయితే ఫైట్ సిన్సీ రాగానే బయటికి వెళ్ళిపోతుంది అని తెలిపారు.
కాగా, మహేష్ ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల కానుంది. ప్రస్తుతం శర వేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. మోకాలి నొప్పి ఇబ్బంది పెట్టడం వల్ల మహేష్ షూట్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు.