జ‌క్క‌న్న‌తో బాల‌య్య `అన్ స్టాప‌బుల్‌` సంద‌డి..ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే!

ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగానే అల‌రించిన న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ తొలిసారి హోస్ట్‌గా మారి చేస్తున్న షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే`. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్ర‌సారం అవుతోంది. ఇప్ప‌టికే నాలుగు ఎపిసోడ్స్ పూర్తి అవ్వ‌గా.. ఫ‌స్ట్ ఎపిసోడ్‌కి మోహ‌న్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌కి నాని, మూడో ఎపిసోడ్‌కి బ్ర‌హ్మానందం-అనిల్ రావిపూడి, నాలుగో ఎపిసోడ్‌కి అఖండ టీమ్ గెస్ట్‌లుగా విచ్చేసి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు.

బాల‌య్య కూడా త‌న‌దైన హోస్టింగ్‌తో అటు గెస్టుల‌ను, ఇటు ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఐదో ఎపిసోడ్ గెస్ట్‌లు ఎవ‌రూ అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఆహా టీమ్ ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ సారి బాల‌య్య‌తో అన్ స్టాప‌బుల్ సంద‌డి చేసేందుకు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సంగీత ద‌ర్శ‌కుడు కీరవాణి వ‌చ్చారు.

ఈ విష‌యాన్ని తెలుపుతూ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆహా వారు కొన్ని ఫొటోల‌ను షేర్ చేశారు. ఆహాలో `అన్ స్టాపబుల్` షోకు కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేథ్యంలోనే తాను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `ఆర్ఆర్ఆర్‌` ను బాల‌య్య టాక్ షో ద్వారా ప్రమోట్ చేయాలని జ‌క్క‌న్న భావించార‌ట‌. అందుకే ఆయ‌న కీర‌వాణితో క‌లిసి అన్ స్టాపబుల్‌కి గెస్ట్‌గా వాచ్చార‌ని తెలుస్తోంది.

ఇక ఈ ఎపిసోడ్‌లో బాల‌య్య.. ఆర్ఆర్ఆర్ సినిమా విష‌యాల‌తో పాటుగా జ‌క్క‌న్న‌, కీర‌వాణిల వ్య‌క్తిగ‌త విష‌యాల‌పై సైతం ప్ర‌శ్న‌లు సంధించా డ‌ని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ అటు బాల‌య్య, ఇటు జ‌క్క‌న్న ఫ్యాన్స్‌కి క‌న్నుల పండ‌గ‌లా ఉండ‌టం ఖాయం. కాగా, బాల‌య్య సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం అఖండ స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆయ‌న త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్ర‌క‌టించారు. ఇటీవ‌లె ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది.

Share post:

Latest