`అఖండ` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని ఫుల్ జ్యోష్‌లో ఉన్న నటసింహం నందమూరి బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్లో 107వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తోంది. ఇటీవలె పూజా కార్యక్రమాలతో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం వచ్చే ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టైటిల్ లీకై నెట్టింట హల్చల్ చేస్తోంది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం.. ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని `వేటపాలెం` అనే టైటిల్‌ను ఖరారు చేశారట. బాలయ్యకు కూడా టైటిల్ బాగా నచ్చిందట. అంతే కాదు, త్వరలోనే ఈ టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా కథ రాయలసీమ నేపథ్యంలో సాగనుంది.
తండ్రీకొడుకులుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నారని అంటున్నారు. ఒక పాత్రలో ఫ్యాక్షన్ లీడర్ గాను .. మరో పాత్రలో పోలీస్ ఆఫీసర్ గాను ఆయన కనిపించనున్నారని టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.