ఊర మాస్ లుక్ లో బన్నీ మేకోవర్, మూవీ రిలీజ్ కి ముందే సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో పుష్ప సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అల్లు అర్జున్ కెరీర్లోనే తొలిసారిగా పాన్ ఇండియా మూవీగా పుష్ప అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య ఇవాళ పుష్ప థియేటర్లలో విడుదలైంది. పుష్ప సినిమాల అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని సినిమా చూసి వచ్చిన వారు చెబుతున్నారు.
పుష్ప ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని, సెకండాఫ్ కొంచెం స్లోగా ఉందని ట్విట్టర్ ద్వారా ప్రేక్షకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే యూఎస్ లో గత రాత్రి నుంచే పుష్ప ప్రీమియర్స్ వేస్తున్నారు. ఈ మూవీ యూఎస్ బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఈ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తోంది. యు.ఎస్.లో 248 లొకేషన్స్ లో పుష్ప మూవీని భారీగా విడుదల చేశారు. ప్రీవియర్స్ ద్వారా పుష్ప దాదాపు 406 కే డాలర్లు వసూలు చేసి దుమ్ము రేపింది.
ఈ సినిమా 2021లో యూఎస్ బాక్సాఫీసు వద్ద బిగ్గెస్ట్ ప్రీమియర్స్ గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన తొలి రెండు చిత్రాలలో ఒకటిగా నిలిచినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పుష్పకు తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ రావడంతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. 2021లో తెలుగులో విడుదలైన సినిమాల్లో బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవగా, ఇప్పుడు పుష్ప రాజ్ గా బన్నీ కూడా కలెక్షన్లు కొల్లగొడుతున్నాడు. ఫైనల్ ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.