వెంకటేష్-రోజాల మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?

November 29, 2021 at 11:13 am

సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరో, హీరోయిన్ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం, మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ‌టం ఎంత కామ‌నో.. కొన్నాళ్ల‌కు వాళ్లు క‌లిసి పోవ‌డం కూడా అంతే కామ‌న్‌. కానీ, టాలీవుడ్ విక్ట‌రీ వెంక‌టేష్‌, ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ రోజాల మ‌ధ్య మాత్రం ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా 25 ఏళ్ల నుంచీ మాట‌లు లేవు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

అస‌లు వివాదాల‌కు ఎప్పుడూ ఆమ‌డ దూరంలో ఉండే వెంక‌టేష్‌కు రోజాతో గొడ‌వేంటి..? వీరిద్ద‌రూ ఎందుకు మాట్లాడుకోవ‌డం లేదు..? వంటి ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కొన్నాళ్ల క్రితం వెంకటేష్ హీరోగా, రోజా హీరోయిన్ గా, ఆమె భర్త సెల్వమణి దర్శకుడిగా `చినరాయుడు` అనే ఒక సినిమాను తీద్దామని అనుకున్నారు.

కానీ, ఈ ప్రాజెక్ట్ ప‌లు కార‌ణాల మ‌ధ్య‌లోనే ఆగిపోగా.. కొద్ది రోజుల త‌ర్వాత వేరే దర్శక నిర్మాతలతో వెంకటేష్..విజయశాంతి తో కలిసి చిన్నరాయుడు సినిమాను పూర్తి చేశారు. దీంతో చిర్రెత్తుకుపోయిన రోజా వెంక‌టేష్‌పై మండిప‌డ‌గా.. ఆయ‌న త‌న ప్రమేయం ఏమీ లేదని, దర్శక నిర్మాతల వల్లనే హీరోయిన్‌ని మార్చవలసి వచ్చిందని స‌ద్దిచెప్పార‌ట‌.

ఇక ఆ త‌ర్వాత వెంకీతో `పోకిరి రాజా` సినిమాలో న‌టించింది రోజా. అయితే ఈ సినిమా షూటింగ్ నిమిత్తం చిత్ర యూనిట్ ముంబై వెళ్లిందట. అయితే రోజా ని ముంబైలోని ఒక హోటల్లో మూడు రోజులపాటు ఖాళీగా కూర్చో పెట్టారట. దాంతో విసుగు చెందిన రోజా అక్క‌డి నుంచి వెళ్లిపోయింది. ఆ త‌ర్వాత ప‌లు గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం వ‌ల్ల‌ వెంక‌టేష్‌తో ఇక న‌టించ‌కూడ‌ద‌ని రోజా నిర్ణ‌యించుకుంది. అందు వ‌ల్ల‌నే వెంకీ ఆమెతో మాట్లాడ‌టం మానేశార‌ని టాక్‌.

వెంకటేష్-రోజాల మ‌ధ్య మాట‌లు లేక‌పోవ‌డానికి కార‌ణం అదేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts