బిగ్ బాస్ హోస్ట్ గా స్టార్ హీరో డాటర్.. ఆమె స్టార్ హీరోయిన్ కూడా..!

బిగ్ బాస్ కార్యక్రమంపై టీవీ వీక్షకులు ఎంత ఆసక్తి చూపిస్తారో అందరికీ తెలిసిందే. హిందీతో పాటు దక్షిణాది లోని అన్ని భాషల్లో సైతం ప్రముఖ ఛానల్ లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సమంత, నాని, ఎన్టీఆర్ కూడా హోస్ట్ గా చేశారు. ఇక తమిళ బిగ్ బాస్ షో హోస్ట్ గా కమలహాసన్ వ్యవహరిస్తున్నారు. నటి రమ్యకృష్ణ కూడా అప్పుడప్పుడు హోస్ట్ గా పలకరించారు.

ప్రస్తుతం కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన ఐసోలేషన్ కు పరిమితమయ్యారు. కొద్దిరోజుల కిందట అమెరికా లో పర్యటించిన కమలహాసన్ ఇండియాకు వచ్చిన తర్వాత కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకో గా ఆయనకు పాజిటివ్ తేలింది. దీంతో ఆయన హీరోగా నటిస్తున్న విక్రం సినిమా షూటింగ్ కూడా ఆగిపోయింది. బిగ్ బాస్ షోకి కూడా హోస్ట్ గా ఉన్న ఆయన దీనికి కూడా దూరమయ్యారు.

ఈ నేపథ్యంలో బిగ్ బాస్ వచ్చే ఎపిసోడ్స్ కి శృతిహాసన్ హోస్ట్ గా వ్యవహరించునుంది. ఇందుకు సంబంధించి బిగ్ బాస్ షో నిర్వాహకులు శృతి హాసన్ తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. శృతిహాసన్ మంచి సింగర్ కూడా కావడంతో ఆమె అయితేనే హోస్ట్ గా బాగుంటుందని షో నిర్వాహకులు భావిస్తున్నారని తెలుస్తోంది. అన్ని కుదిరితే అతి త్వరలోనే శృతిహాసన్ హోస్ట్ గా ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది.

Share post:

Latest