నిన్నటి శృంగార‌తార అనూరాధ భ‌ర్త ఎలా చ‌నిపోయారో తెలిస్తే.. గుండె త‌డ‌వుతుంది!

November 24, 2021 at 2:15 pm

సినిమా అనేది రంగుల ప్రపంచం మాత్రమే కాదు, ఇది ఓ మాయ లోకం కూడా. ఇక్కడ కంటికి కనిపించేవి ఏవి నిజాలు కావు. తెరపై హీరోలుగా ఉంటూ.., తెర వెనుక విలన్ వేషాలు వేసిన చాలా మనది మగమహారాజులు పరిశ్రమలో ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో హీరోయిన్స్ వేసే వాళ్లంతా గొప్ప వాళ్ళు కాదు, వ్యాంప్ రోల్స్ వేసే వారంతా చెడ్డ వారు కాదు. ఐటెం సాంగ్స్ అందాలు ఆరబోసే ఆ తారలలో కూడా ఓ గొప్ప మనసు ఉంటుంది. అలాంటి ఓ గొప్ప స్త్రీ గురించే మనం ఇప్పుడు చెప్పుకోబోతుంది.

అనూరాధ.. ఈ పేరు వినగానే అందరికీ ఒకప్పటి క్ల‌బ్ సాంగ్స్‌లో, ఐట‌మ్ నంబ‌ర్స్‌ గుర్తుకి వస్తాయి. అనురాధ అసలు పేరుసులోచ‌న‌. జీవితంలో తల్లిని తప్ప ఆమె ఎవ్వరిని నమ్మేవారు కాదు. ముఖ్యంగా పరిశ్రమలో మగవాళ్ల బుద్దికి ఆమె విరక్తి చెందిపోయింది. హీరోయిన్ గా ఉన్నా, ఐటెం సాంగ్స్ కి డ్యాన్స్ చేసినా, మలయాళంలో మంచి పాత్రలు వేసినా.. అందరూ ఆమెని అదే బుద్దితో చూస్తూ వచ్చారు. దీంతో అనురాధ అందరితో మాట్లాడటం మానేసింది. ఆ సమయంలో ఆమెకి స‌తీశ్ కుమార్‌ అనే యువ కొరియోగ్రాఫర్ పారిచయం అయ్యాడు. అతను అప్పుడప్పుడే మాస్టర్ గా ఎదుగుతూ ఉన్నాడు. కమల్ హాసన్ కి ఆ కుర్ర కొరియోగ్రాఫర్ అంటే అమితమైన ఇష్టం. ఇంత మంచి పేరు తెచ్చుకున్నా సతీశ్ మాత్రం సెట్ లో ఆడవారిని బాగా గౌరవించేవాడు. అనురాధ పైన కూడా ఇలాంటి గౌరవమే చూపించాడు. మాటల్లోనే కాదు, అతను మనసులో కుడి అంతే స్వచ్ఛమైన వ్యక్తి. అతనిలో ఆ లక్షణం అనురాధకి బాగా నచ్చింది. అతనితో స్నేహం చేయడం ప్రారంభించింది. కానీ.., ఇద్దరు ఏనాడు హద్దులు దాటలేదు. కానీ.., పరిశ్రమలో రూమర్స్ పుట్టడం ఎంత సేపు? వీరిద్దరూ లేచిపోయారని ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు పుట్టించారు. కళ్ల ముందే తాము కనిపిస్తున్నా ఈ పుకార్లకు చెక్ పడలేదు. చివరికి ఈ వార్తలను అనురాధ తల్లి కూడా నమ్మేసింది. సతీశ్ ఇంటికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది. తమ బంధాన్ని కన్నతల్లి కూడా అర్ధం చేసుకోకపోవడం అనురాధని బాధించింది. అప్పుడు అనూరాధ డిసైడ్ చేసుకున్నారు, స‌తీశ్‌నే పెళ్లిచేసుకోవాల‌ని. అనుకోవ‌డం ఆల‌స్యం.. అమ్మ అభీష్టానికి విరుద్ధంగా ఇంట్లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి అత‌డిని పెళ్లిచేసుకుంది.

తొమ్మిదేళ్లు వాళ్లు పాటు వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి అభిన‌య‌శ్రీ‌, కాళీచ‌ర‌ణ్‌ ఇద్దరు పిల్లలు పుట్టారు. అయితే.. ఆ త‌ర్వాత ఒక బైక్ యాక్సిడెంట్‌లో స‌తీశ్ త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. అతను ఇక లేచి తిరగడం అసాధ్యమని డాక్టర్స్ తేల్చేశారు. కానీ.., అనురాధ కృంగిపోలేదు. భర్తపై ప్రేమని వదులుకోలేదు. అక్కడ నుండి 11 ఏళ్ళ పాటు మంచంలో ఉన్న భర్తకి సేవలు చేసుకుంది. 2007లో ఒక‌రోజు భ‌ర్త‌కు అన్నం తినిపిస్తున్నారు అనూరాధ‌. అత‌నికి పొల‌మారింది. వెంట‌నే త‌ల‌వాల్చేశారు. అలా.. సతీష్ ప్రాణాలు కోల్పోయాడు. కానీ.., సినిమాల్లో ఎలాంటి పాత్రలు చేసినా.., భర్తని తల్లిలా చూసుకున్న అనురాధ మాత్రం అందరికి ఆదర్శంగా నిలిచింది. చూశారు కదా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

నిన్నటి శృంగార‌తార అనూరాధ భ‌ర్త ఎలా చ‌నిపోయారో తెలిస్తే.. గుండె త‌డ‌వుతుంది!
0 votes, 0.00 avg. rating (0% score)