చిరంజీవితో నటించడమే నాకు శాపంగా మారింది: సుబ్బరాయ శర్మ

November 24, 2021 at 2:03 pm

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన శిఖర సమానం అని చెప్పుకోవచ్చు. అలాంటి చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే ఆర్టిస్ట్ లు అందరికీ పండగే. కానీ., చిరంజీవి సినిమాలో నటించడమే తనకి శాపం అయ్యింది అని ఓ నటుడు స్టేట్మెంట్ ఇస్తే..! ఇది నిజంగా అందరిని ఆశ్చర్యపరిచే అంశమే. ఇంతకీ ఇలాంటి కామెంట్ చేసిన నటుడు ఎవరు? ఆయనకి ఎదురైనా అనుభవం ఏమిటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సీనియర్ యాక్టర్ సుబ్బరాయ శర్మ మీకు గుర్తున్నానారు కదా? ఆయనే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. సుబ్బరాయ శర్మ కెరీర్ స్టార్టింగ్ లో నాటకాలు ఎక్కువగా వేసేవారు. మురళీమోహన్ తో కలసి అప్పట్లో ఈయన చాలా నాటకాల్లో నటించారు. ఆ సమయంలోనే లెజండ్రీ ప్రొడ్యూసర్ రామానాయుడు సుబ్బరాయ శర్మ ని బాగా ఆదరించారు. రామానాయుడు నిర్మించే అన్నీ చిత్రాల్లో సుబ్బరాయ శర్మకి అవకాశం ఉంటూ వచ్చింది. ఒకానొక సమయంలో నాయుడు గారు సుబ్బరాయ శర్మని తన ఇంట్లో మనిషిలా చూస్కున్నారు కూడా.

ఇక ధర్మచక్రం సినిమా చేస్తున్న సమయంలో షూటింగ్ కి మూడు రోజులు గ్యాప్ వచ్చింది. ఆ షూటింగ్ జరుగుతుంది హైదరాబాద్ లో. కానీ.., సుబ్బరాయ శర్మకి చిరంజీవి రిక్షావాడు సినిమా యూనిట్ నుండి కాల్ వచ్చింది. మీ పాత్రకి కాస్త కొనసాగింపు అవసరం వచ్చింది. ఒక్కరోజు షూట్ ఉంది మీరు చెన్నై రావాల్సి ఉంటుందని వారు ఫోన్ చేశారు. దీంతో.. సుబ్బరాయ శర్మ చెన్నై వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా నాయుడు గారిని అడిగాడట. ఈ విషయంలో రామానాయుడు రిక్షావాడు మేకర్స్ పై సీరియస్ అయ్యారట.

తెలుగు సినిమా హైదరాబాద్ లో సెటిల్ అవ్వాలని మేము ఇక్కడ షూటింగ్స్ చేస్తుంటే.. మీరంతా మళ్ళీ చెన్నై వెళ్లి నటిస్తా అంటే ఎలా? మీకు మూడు రోజులు గ్యాప్ ఉంది. ఇక్కడ షూటింగ్ జరిగే సినిమాలు ఎన్నైనా చేసుకుని రండి.., చెన్నై కి మాత్రం పోవడానికి వీలు లేదని నాయుడు గారు తేల్చి చెప్పారట. దీంతో.. ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు సుబ్బరాయ శర్మ. ఇక చిరంజీవి లాటి పెద్ద హీరో సినిమా తన వల్ల ఆగిపోవడం ఇష్టం లేక.. సుబ్బరాయ శర్మ చెన్నై వెళ్లి ఆ సినిమాని పూర్తి చేసి. మళ్ళీ రెండు రోజుల్లోనే ధర్మచక్రం సెట్స్ కి వచ్చారట. కానీ.., తాను నమ్మి ఇన్ని అవకాశాలు ఇచ్చిన వ్యక్తి.. తనమాట లెక్క చేయకపోవడంతో నాయుడు గారికి కోపం వచ్చింది. అప్పటి నుండి రామానాయుడు సుబ్బరాయ శర్మ తో మాట్లాడటం మానేశారట. నాయుడు గారి అండ లేకపోవడంతో సుబ్బరాయ శర్మ కి తరువాత కాలంలో క్రమేపి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇందుకే చిరంజీవి సినిమాలో నటించడమే తనకి శాపం అయింది అని సుబ్బరాయ శర్మ కామెంట్స్ చేసింది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

చిరంజీవితో నటించడమే నాకు శాపంగా మారింది: సుబ్బరాయ శర్మ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts