ఆపుకోలేకపోయిన సిద్దార్థ్.. మెంట‌ల్ అంటున్న స‌మంత‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌లు క‌లిసి న‌టించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం డీవీవీ దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపొందించారు. జనవరి 7న రిలీజ్ కు రెడీ అవుతుండడంతో.. చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్‌ను షురూ చేసింది.

ఈ నేప‌థ్యంలోనే నిన్న ఈ సినిమా సెకెండ్ సింగిల్ `నాటు నాటు` లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది. చంద్రబోస్ రాసిన ఈ పాటను కాళ భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆల‌పించ‌గా.. కీరవాణి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఈ సాంగ్‌లో నాటు నాటు అంటూ ఊర‌నాటుగా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌లు స్టెప్పులేశారు. అదిరిపోయే బీట్ తో సాగిన ఈ సాంగ్ దాదాపు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. దీంతో అభిమానులు, నెటిజ‌న్లుతో పాటు సెలబ్రెటీలు సైతం ఈ సాంగ్‌పై త‌మ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.

Did Samantha Akkineni Take A Dig At Siddharth With Her 'Personal Crisis' Remark? - Filmibeat

ఇందులో భాగంగానే హీరో సిద్దార్థ్.. `ఎగ్జైట్మెంట్‌ను ఆపుకోలేకపోతోన్నాను.. ఇండియన్ సినిమాలో గొప్ప డ్యాన్సర్లైన రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి మంటపెట్టేస్తున్నారు. థియేటర్లోఇక అరుపులే.. ఇదే రాజమౌళి మ్యాజిక్. దిమ్మతిరిగిపోయిందంటూ` ట్వీట్ వేశాడు. మ‌రోవైపు స‌మంత ఈ సాంగ్‌పై స్పందిస్తూ.. `మెంటల్` అని పిచ్చెక్కిపోతోందనే అర్థంలో ట్వీట్ చేసింది. దాంతో వారి ట్వీట్స్ కాస్త వైర‌ల్‌గా మారాయి.

https://twitter.com/Actor_Siddharth/status/1458391547897024514?s=20

https://twitter.com/Samanthaprabhu2/status/1458376463162380289?s=20