ట్రెండింగ్ లో పుష్ప.. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందిగా?

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ఎర్రచందనం స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా డిసెంబర్ 17 న దేశవ్యాప్తంగా ఐదు భాషలలో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇందులో మలయాళం స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇటీవలే సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు సంబంధించిన సమస్యలు కూడా తీరిపోయినా అక్కడ పుష్ప సినిమా మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ఇంకా ప్రారంభించలేదు.

 

ఇక త్వరలోనే హిందీ రిలీజ్ కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను భారీ ఎత్తున స్టార్ట్ చేయనున్నారు మేకర్స్.తాజాగా సోషల్ మీడియాలో పుష్ప అనే హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు ట్విట్టర్ లో కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. కృష్ణ సినిమా విడుదల కావడానికి సరిగ్గా నెల రోజులే ఉంది.దీనితో బన్నీ ఫాన్స్ పుష్ప ను ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎండ అవుతున్న హాస్టల్ ను బట్టి చూస్తే ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతోంది. ఇక సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.