భారీ రిస్క్ చేస్తున్న బ‌న్నీ..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!?

November 5, 2021 at 8:33 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫహాద్‌ ఫాజిల్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు.

Allu Arjun-starrer 'Pushpa' Sets Release Date, See New Movie Poster

అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగాన్ని `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే టాకీ పార్ట్ అంతా పూర్త‌య్యింది. రెండు పాట‌ల చిత్రీక‌ర‌ణ మాత్ర‌మే మిగిలి ఉంది. వాటిని పూర్తి చేసే ప‌నిలోనే బ‌న్నీ, సుక్కూలు నిమ‌ఘ్న‌మై ఉన్నారు. అందుకే దీపావ‌ళి రోజున కూడా సినిమా షూటింగ్‌ను షురూ చేసేశారు.

Image

అది కూడా 1000 మంది డ్యాన్స‌ర్ల‌తో. అవును, ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ భారీ మాస్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం అల్లు అర్జున్ ఏకంగా 1000 మంది డాన్సర్లతో కలిసి షూట్‌లో పాల్గోంటున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే ఈ విష‌యంపైనే ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. క‌రోనా విజృంభిస్తోన్న స‌మయం ఇది. ఇలాంటి త‌రుణంలో వెయ్యి మందితో షూటింగ్ అంటే భారీ రిస్క్‌తో కూడుకున్న ప‌ని. అందువ‌ల్ల‌నే ఫ్యాన్స్ కాస్త క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌వుతున్నారు.

భారీ రిస్క్ చేస్తున్న బ‌న్నీ..ఆందోళ‌న‌లో ఫ్యాన్స్‌!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts