`ఆర్ఆర్ఆర్` సెకండ్ సింగిల్ ప్రోమో వ‌చ్చేసింది…!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్‌, ఒలివియా మోర్రీస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

SS Rajamouli Takes a Risky Date For RRR Movie Release?

భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్న చిత్ర యూనిట్‌.. ఈ సినిమా సెకెండ్ సింగిల్‌ను నవంబర్ 10న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లుగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ సాంగ్ ప్రోమోను విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.

Ss rajamouli ram charan jr ntr rrr movie naattu koothu promo naatu naatu song | Galatta

`నా పాట సూడు.. నాటు.. నాటు.. నాటు.. నాటు.. వీర నాటు` అంటూ సాగిన ప్రోమో ఆక‌ట్టుకుంటోంది. ఈ పాటను చంద్రబోస్ రచించగా.. రాహుల సిప్లిగంజ్, కాలబైరవ ఆలపించారు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక ప్రోమో బ‌ట్టీ చూస్తుంటే చరణ్ మరియు ఎన్టీఆర్ త‌మ డాన్స్ తో కేక పుట్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Share post:

Latest