త‌న ప్రెగ్నెన్సీపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కాజ‌ల్‌..ఏం చెప్పిందంటే?

November 9, 2021 at 12:56 pm

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ముంబైలోని తాజ్‌ ప్యాలెస్ హోట‌ల్‌లో అక్టోబర్ 30న అతి కొద్ది బంధువులు, స‌న్నిహితుల మ‌ధ్య కాజ‌ల్‌-గౌత‌మ్‌ల వివాహం వైభ‌వంగా జ‌రిగింది.

I will talk about it when the time is right: Kajal Aggarwal on pregnancy rumours

ఇక పెళ్లైన కొన్ని వారాల‌కే మ‌ళ్లీ సినిమాల‌తో బిజీగా అయిన కాజ‌ల్‌.. గ‌ర్భం దాల్చింద‌ని, త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతుందంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌లను తాజాగా ఖండించిన కాజ‌ల్ ప్రెగ్నెన్సీపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. `ఇప్పుడు నా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. అయితే ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం కచ్చితంగా మాట్లాడతాను. మాతృత్వం అనేద గొప్ప విషయం.

Kajal Agarwal expecting her first child with Gautam Kitchlu?

నాకు సంబంధించినంత వ‌ర‌కు ఓ వైపు ఎగ్జ‌యిట్‌మెంట్‌ను క‌లిగిస్తూనే నెర్వ‌స్‌గానూ అనిపిస్తుంది. అలాగే నా చెల్లెలు నిషా తల్లి అయిన‌ప్పుడు తనెలాంటి ఫీలింగ్స్ ఫేస్ చేసిందో దగ్గర నుంచి గమనించాను. ఆమె జీవితం ఎలా మారిపోయిందో చూశాను. ఇక నిషా త‌న‌యుడు ఇషాన్ తో ఎక్కువ స‌మ‌యాన్ని గ‌డుపుతూ వాడిని త‌ల్లిలాగా సాకాను. ఇప్పుడు నాకు పిల్ల‌లు పుడితే ఎలా ఉంటుంద‌నే భావ‌న మ‌రింత ఎమోష‌న్‌ను పెంచుతుంద‌నే భావిస్తున్నాను` అని పేర్కొన్న కాజ‌ల్ ప‌రోక్షంగా తాను గ‌ర్భ‌వ‌తిని కాద‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది.

త‌న ప్రెగ్నెన్సీపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన కాజ‌ల్‌..ఏం చెప్పిందంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts