లారెన్స్ గొప్ప మ‌న‌సు..రియల్ `సినతల్లి`కి భారీ సాయం..!

November 9, 2021 at 11:47 am

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజా చిత్రం `జై భీమ్‌` ఓటీటీలో విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. సినీ ప్రిములు, సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు.. ఇలా అంద‌రూ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తమిళనాడులోని ఇరులార్ తెగకు చెందిన పార్వతి అనే మహిళ.. తన భర్త రాజకన్ను విషయంలో జరిగిన అన్యాయంపై మానవ హక్కుల ఉద్యమనేత, లాయర్ చంద్రును ఆశ్రయించింది. ఆయనతో కలిసి న్యాయ పోరాటం సాగింది.

Jai Bhim Movie Review: A Powerful Hard Hitting Film

వీరి నిజ జీవితంలో జరిగిన అంశాలనే ద‌ర్శకుడు జ్ఞానవేల్ `జై భీమ్‌`గా తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందాడు. ఈ చిత్రంలో రాజకన్ను, పార్వతి అనే దంపతులను ఆధారంగా చేసుకునే రాజన్న, సినతల్లి పాత్రలను రూపొందించారు డైరెక్ట‌ర్‌. అయితే తాజాగా ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ చ‌లించిపోయి.. చిత్ర‌యూనిట్‌కి మనసారా అభినంద‌న‌లు తెలిపారు.

Jai Bhim movie review: Pain of the downtrodden, voice of the voiceless

అంతేకాదు, రియ‌ల్ సిన‌త‌ల్లి అయిన పార్వ‌తికి ఆదుకుంటానని ముందుకు వ‌చ్చి లారెన్స్‌ మంచి మన‌సు చాటుకున్నారు. పార్వ‌తికి నా సొంత ఖర్చులతో ఇల్లు క‌ట్టిస్తాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా లారెన్స్ వాగ్దానం చేశారు. దాంతో ఆయ‌న‌పై నెటిజ‌న్లు, అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

లారెన్స్ గొప్ప మ‌న‌సు..రియల్ `సినతల్లి`కి భారీ సాయం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts