కేటీఆర్ ను చూసి అందరూ షాక్.. ఆయన సీఎం కాదు కదా?

November 16, 2021 at 3:12 pm

కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం దేశవ్యాప్తంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రాలకు ప్రైవేటు పెట్టుబడులు ఎలా రాబట్టాలి అనేది టాపిక్. అందరిలాగానే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్, ఫైనాన్స్ మినిస్టర్ హరీశ్ రావు హాజరు కావాలి. ప్రగతి భవన్ నుంచి ఈ సమావేశం నుంచి పాల్గొనాల్సి ఉంది. అయితే అందరూ ఆశ్చర్యపోయేలా సమావేశానికి హరీశ్ రావుతోపాటు సీఎం కేసీఆర్ కాకుండా ఆయన కుమారుడు కేటీఆర్ వచ్చారు. అదేంటి.. ఈయన వచ్చారు అని ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, నిర్మలా సీతారామన్ ఆశ్చర్యపోయారు. సీఎం రాకపోతే ఆయన ప్రతినిధిగా డిప్యూటీ సీఎం రావాల్సి ఉంటుంది. మరి కేటీఆర్ డిప్యూటీ సీఎం కాదే.. కేవలం మంత్రే.. అదీ ఐటీ శాఖా మంత్రి.. ఆర్థిక సంబంధ వ్యవహారాలలో అధికారిక కార్యక్రమాలకు ఆయనకు హాజరయ్యే చాన్స్ లేదు. అయినా వచ్చారు. అంటే.. సీఎం తరువాత ప్రాధాన్యత కల వ్యక్తి ఈయనే అని ఇండికేషన్ ఇచ్చారా అనేది పలువురి అనుమానం.

ఈ వర్చువల్ సమావేశానికి సీఎం కావాలనే గైర్హాజరై కుమారుడిని పంపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చ వల్ల అధికారులు, ప్రభుత్వ వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలకు ఎవరైనా వెళ్లవచ్చు.. అధికారిక సమీక్షలకు అదీ కేంద్ర మంత్రి నిర్వహించే మీటింగుకు ఏ హోదాపై వెళతారని ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ కావాలనే రాలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్న తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొట్టారు. రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, సీఎస్ సోమేష్ ను పంపారు. ఓకే.. సీఎం కాబట్టి వెళ్లడానికి సమయం లేదని అనుకుంటే ఈ వర్చువల్ మీటింగుకు, అదీ ప్రగతి భవన్ నుంచే జరిగే సమీక్షకు హాజరు కాకపోతే ఎలా అని రాజకీయ పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూడరాదు. పార్టీల పరంగా వైరుద్ధ్యాలు ఉండవచ్చు.. కానీ అధికారికంగా జరిగే కార్యక్రమాలకు రాజకీయాలను పక్కన పెట్టి హాజరైతే ప్రజలకు మేలు జరుగుతుంది. లేకపోతే రాజకీయ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు పెద్ద తేడా ఉండదు.

కేటీఆర్ ను చూసి అందరూ షాక్.. ఆయన సీఎం కాదు కదా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts