యాక్టర్ సూర్యను..అన్నికోట్లు డిమాండ్ చేస్తున్నవన్నియార్..!

November 16, 2021 at 3:18 pm

హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. అయితే ఈ మూవీ ను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. జై భీమ్ పై వన్నియార్ వర్గాల నేతలు మండిపడుతున్నారు. తమ వర్గాన్ని కించపరిచారంటూ.. ఏకంగా 5 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించమని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా అందుకు సంబంధించి జై భీమ్ మూవీ నిర్మాత సూర్యకు,వన్నియార్ సంఘం నేతలు నోటీసులు జారీ చేయడం జరిగింది.తమ కమ్యూనిటీకి చెందిన ప్రజలకు వ్యతిరేకంగా తప్పుడు, హానికరమైన.. పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం.. లేదా ప్రచురించడం వెంటనే మానేయాలని సూచించారు.

అంతేకాకుండా చిత్ర నిర్మాతలలు కూడ క్షమాపణలు చెప్పాలని తెలియజేశారు.పరువు నష్టం కలిగించేలా సినిమాలో ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు నిన్నటి రోజున జై భీమ్ దర్శకుడు TJ. జ్ఞానవేల్ కు వన్నియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లీగల్ నోటీస్ జారీ చేయడం జరిగింది. ఈ నోటీసు అందిన ఏడు రోజుల తర్వాత నష్టపరిహారం చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. జై భీమ్ సినిమా లో పోలీస్ పాత్ర వన్నియార్ కులానికి చెందిన వారని తెలియజేశారు.

యాక్టర్ సూర్యను..అన్నికోట్లు డిమాండ్ చేస్తున్నవన్నియార్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts