ఆ హీరోల మ‌ధ్య న‌లిగిపోతున్న కీర్తి సురేష్‌..అస‌లేమైందంటే?

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న కీర్తి సురేష్‌.. ఇప్పుడు మెగా, నంద‌మూరి హీరోల మ‌ధ్య తీవ్రంగా న‌లిగిపోతోంది. అస‌లేమైందంటే.. కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `గుడ్ లక్ సఖి`. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌లు పోషించారు.

- Advertisement -

Image

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ 26న విడుదల చేస్తామని ఇటీవ‌లె చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే అనూహ్యంగా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `అఖండ` చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌ల అయ్యేందుకు సిద్ధ‌మైంది. దీంతో డిసెంబ‌ర్ 3న రిలీజ్ కావాల్సి ఉన్న మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ `గ‌ని` చిత్రం డిసెంబ‌ర్ 24కి షిఫ్ట్ అయింది.

Ghani News in Telugu | Breaking News in Telugu | Online News Live Updates, తెలంగాణ వార్తలు on Ghani

ఫ‌లితంగా సోలోగా విడుద‌ల కావాల‌ని చూసిన కీర్తి సురేష్‌కి గ‌ని రూపంలో బిగ్ షాక్ త‌గిలింది. ఇక ఈ నేప‌థ్యంలోనే థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు కీర్తి సురేష్‌ వెన‌క్కి త‌గ్గింది. తాజాగా మేక‌ర్స్ డిసెంబర్ 10న `గుడ్ లక్ సఖి`ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

Share post:

Popular