ఆర్ఆర్ఆర్ లో యాక్షన్ సీక్వెన్స్ కన్నా దానికే ఇంపార్టెన్స్.. రాజమౌళి కామెంట్స్ ..!

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రాలే గుర్తుకొస్తాయి. రాజమౌళి సినిమాలు ఎక్కువగా యాక్షన్ ప్రధానంగా సాగుతుంటాయి. ఆయన సినిమాలు ఎంత యాక్షన్ నేపథ్యంలో సాగినా సెంటిమెంట్ కు మాత్రం ఎలాంటి ఢోకా ఉండదు. ఛత్రపతి వంటి మాస్ సినిమాలో కూడా మదర్ సెంటిమెంట్ బాగా క్లిక్ అయింది.

సై సినిమాలో తమ కాలేజీని కాపాడు కోవడం కోసం స్టూడెంట్స్ పడే తపన, బాహుబలి లో మదర్ సెంటిమెంట్, కట్టప్పతో బంధం, విక్రమార్కుడు లో కూతురి సెంటిమెంట్, స్టూడెంట్ నెంబర్ వన్ లో ఫాదర్ సెంటిమెంట్, మర్యాద రామన్న సినిమాలో తనను ప్రేమించిన అమ్మాయి కోసం చావడానికి కూడా సిద్ధమవడం.. ఇలా రాజమౌళి తన ప్రతి సినిమాలో ఎమోషన్ కు ప్రాధాన్యం ఇస్తుంటారు.

తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఎమోషనల్ డ్రామాకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని రాజమౌళి తెలిపాడు. ఈరోజు ఆర్ఆర్ఆర్ నుంచి జనని అనే సాంగ్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ పాట తమిళ వెర్షన్ విడుదల సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు సినిమా మొత్తం ఎమోషనల్ గా సాగుతోందని తెలిపాడు. తన సినిమాల్లో కచ్చితంగా సెంటిమెంట్ కు ప్రాధాన్యం ఉంటుందని ఆయన చెప్పాడు. దీనిని బట్టి రాజమౌళి మరో సారి తన బలాన్ని ఆర్ఆర్ఆర్ లో చూపించనున్నట్లు అర్థమవుతోంది.