గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో..!

మలయాళంలో సంచలన విజయం సాధించిన మోహన్ లాల్ లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అని పేరు పెట్టారు. కాగా లూసిఫర్ సినిమా ఎక్కడికి తెలుగులో విడుదల కావడంతో చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా కథ లో భారీ మార్పులు చేశారు. ఈ సినిమాలో చిరంజీవి తో పాటు సత్యదేవ్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా మాతృకలో వివేక్ ఒబెరాయ్ పోషించిన పాత్రను తెలుగులో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ పోషించే అవకాశం ఉందని తెలుస్తోంది.

గాడ్ ఫాదర్ లో నయనతారకు తమ్ముడిగా సత్యదేవ్ నటిస్తుండగా, ఆమె భర్తగా, విలన్ గా సంజయ్ దత్ ని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సంజయ్ దత్ ఇప్పటికే కేజీఎఫ్ -2 సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. లూసిఫర్ లో వివేక్ ఒబెరాయ్ చేసిన పాత్రకు సంజయ్ దత్ అయితే బాగుంటుందని భావించిన చిత్రయూనిట్ ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో చిరంజీవితో పాటు నయనతార, సత్యదేవ్, ఓ కీలక పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తుండగా.. ఇప్పుడు సంజయ్ దత్ కూడా నటించనున్నట్లు వార్తలు వస్తుండడంతో హాట్ టాపిక్ గా మారింది. వివిధ భాషలకు చెందిన నటులను ఈ సినిమా కోసం ఎంపిక చేయడంతో గాడ్ ఫాదర్ కు పాన్ ఇండియా అప్పిల్ వచ్చినట్లయింది. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. ఆచార్య సినిమా విడుదల తర్వాత ఈ మూవీ షూటింగ్ మరింత వేగంగా జరుగనుంది.

Share post:

Latest