సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్‌కి మెగా స్టార్ ఫిదా అయిపోయారు. అంతే కాదు, ట్విట్టర్ ద్వారా ఆమెపై ప్రశంసల వర్షం కూడా కురిపించాడు. అయితే ఆమెను ఇంత సడెన్‌గా చిరు మెచ్చుకోవడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అతి తెలియాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే.
యంగ్ హీరో తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా నటించిన తాజా చిత్రం `అద్భుతం`. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ మొగుళ్ల నిర్మించారు. క్రాస్ టైం కనెక్షన్ కాన్సెప్ట్‌తో సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా నవంబర్ 19న ప్రేక్షకుల ముందు వచ్చింది.
తెలిసిన కాన్సెప్ట్ అయినా ఆద్యంతం ఆసక్తికరంగా సాగడంతో `అద్భుతం` సినిమా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది. సూర్యగా తేజ సజ్జ నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లు, క్లైమ్యాక్స్ సీన్స్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరోవైపు శివానికి ఇది మొదటి సినిమానే అయినప్పటికీ.. నటన పరంగా మంచి మార్కులే సంపాదించింది.
అయితే తాజాగా ఈ సినిమా చూసిన చిరంజీవి.. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `నిన్న రాత్రే హాట్ స్టార్ లో ‘అద్భుతం’ సినిమాను చూశాను. ఇది ఒక న్యూ ఏజ్ ఎంగేజింగ్ నోవెల్ సినిమా. తేజ సజ్జ .. శివాని ఇద్దరూ కూడా చాలా బాగా నటించారు. వారి నటన నన్ను ఎంతో ఇంప్రెస్ చేసింది. ఈ సినిమా టీమ్ లోని అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంది` అంటూ ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు.
Watched #AdbhutamOnHotStar last night.A new age film with engaging novel concept.Very Impressive performances by young team @tejasajja123 @Rshivani_1
They surely hv bright futures ahead! Congratulating & wishing entire team Great Success! @MallikRam99 @MahatejaC @PrasanthVarma— Chiranjeevi Konidela (@KChiruTweets) November 23, 2021