నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా, శ్రీకాంత్ విలన్‌గా కనిపించబోతున్నారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదల కానుంది.
అఖండ తర్వాత బాలయ్య తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్రకటించాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటించబోతోంది. ఈ చిత్రం పూర్తైన వెంటనే బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని చేయనున్నాడు.
వచ్చే ఏడాది ఈ మూవీలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే తాజాగా బాలయ్య లిస్ట్‌లో మరో డైరెక్టర్ పేరు వచ్చి చేరింది. ఇంతకీ ఆయన ఎవరో కాదు.. కొరటాల శివ. ఇటీవల కొరటాల శివ.. బాలయ్యకు ఓ అదిరిపోయే కథ చెప్పారట. పైగా అది మల్టీస్టారర్ స్టోరీ అని.. బాలయ్యకు కూడా బాగా నచ్చి వెంటనే ఓకే చెప్పారని టాక్ నడుస్తోంది.
మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. ఈ మల్టీస్టారర్ మూవీతో బాలయ్యతో నటించబోయే మరో హీరో ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఇప్పటికే చిరుతో `ఆచార్య` పూర్తి చేసుకున్న కొరటాల.. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు.