`అనుభవించు రాజా` ట్రైలర్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ త‌రుణ్, కశిష్‌ ఖాన్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `అనుభ‌వించు రాజా`. శ్రీను గవిరెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం నవంబర్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించిన చిత్ర యూనిట్‌.. తాజాగా కింగ్ నాగార్జున చేతుల మీద‌గా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయించారు.

Raj Tarun first look from Anubhavinchu Raja

విలేజ్ లో పక్కా మాస్ కుర్రాడు అనిపించుకున్న హీరో.. హీరోయిన్ కోసం ఆమె పని చేస్తున్న కంపెనీ సెక్యూరిటీ గార్డుగా మారతాడు. ఆ త‌ర్వాత ఆమెను ప్రేమ‌లో దింపేందుకు హీరో ప‌డే పాట్లు ట్రైల‌ర్‌లో ఫ‌న్నీగా చూపించారు. అలాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించిన స్టోరీ సీన్స్ కూడా ఫ్రెష్ గా ఉన్నాయి.

Anubhavinchu Raja Teaser: Raj Tarun turns a Gambler | Manacinema

`బంగారంగాడి మనసు సినిమా హాల్ లాంటిది .. వారానికో సినిమా వత్తావుంటది .. పోతావుంటది .. ఏదీ పర్మినెంట్ గా ఆడదు ఇక్కడ` అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. మొత్తానికి అదిరిపోయిన ఈ ట్రైల‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. న‌టుడు అజయ్ ఈ మూవీలో విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. మ‌రి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న రాజ్ త‌రుణ్.. ఈసారైనా హిట్ కొడ‌తాడో..లేదో..చూడాలి.