ఇంకా తేలని విరాటపర్వం ఫలితం.. ఎప్పుడు సామీ!

November 17, 2021 at 11:33 am

టాలీవుడ్‌లో షూటింగ్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల కేటగిరిలో ఖచ్చితంగా విరాటపర్వం ఉంటుంది. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే విషయంపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఎలాంటి క్లారిటీ లేదు.

అయితే ఆ మధ్య ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించాయి. కానీ ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాను ఎప్పుడు, ఎలా రిలీజ్ చేస్తారనే విషయంపై ఇంకా సందిగ్ధత నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ విషయంలో మరోసారి ఇండస్ట్రీ వర్గాల్లో కొత్త వార్త వినిపిస్తోంది. ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్ర దర్శకనిర్మాతలు ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం-2 ఓటీటీ బాటపట్టాయి. దీంతో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ చిత్రాలు నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా అని వారందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే భీమ్లా నాయక్ సినిమాతో సంక్రాంతి బరిలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుండటంతో, విరాటపర్వం చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలా అనే ఆలోచనలో ఇప్పుడు నిర్మాత సురేష్ బాబు పడినట్లు తెలుస్తోంది. మరి విరాటపర్వం చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఇంకా తేలని విరాటపర్వం ఫలితం.. ఎప్పుడు సామీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts