మంచు ల‌క్ష్మి ప‌రువు తీసిన‌ బ‌న్నీ..అస‌లేమైందంటే?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌లు చిత్రాల్లో న‌టించిన ఈ భామ టాలీవుడ్‌లో మంచి న‌టిగా పేరు తెచ్చుకున్నా తెలుగు భాష విషయంలో మాత్రం ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు. అమెరికాలో ఎక్కువ రోజులు పెర‌గ‌డం వ‌ల్ల‌..ఆమె తెలుగుపై ఇంగ్లీష్ ప‌దాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది.

- Advertisement -

Manchu Lakshmi trolled for her tweet about Manchu Vishnu oath taking ceremony for MAA

దాంతో ఆమె ఎక్కడ మాట్లాడినా..? ఏం మాట్లాడినా..? నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ హేళన చేస్తుంటారు. ఇక ఈ విష‌యంపైనే తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మంచు ల‌క్ష్మి పురువు తీసేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా 2.0 యాప్ లాంచ్‌కు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వ్వ‌గా.. ఆ వేడుక‌లో మంచు ల‌క్ష్మి కూడా పాల్గొంది. అయితే ఇద్ద‌రూ స్టేజ్‌పై ఉన్న స‌మ‌యంలో ఆహా అనేది తెలుగు యాప్ అని..అయితే మంచు లక్ష్మి జ‌నాల‌కు అర్థ‌మ‌య్యే తెలుగులో మాట్లాడాల‌ని బ‌న్నీ సెటైర్ వేసేశారు.

Latest Telugu cinema news |Telugu Movie reviews|Tollywood

దాంతో మంచు ల‌క్ష్మి జనాల‌కు కాదు నాకు అర్థ‌మ‌య్యే తెలుగులోనే మాట్లాడ‌తా అని బ‌దులిచ్చింది. ఈ క్ర‌మంలోనే ఇంకా ఆమె మాట్లాడుతూ నేను ఇప్ప‌టి వ‌ర‌కు హోస్ట్ చేశాను. షో చేశాను. గెస్ట్‌గా రావ‌డం కూడా అయ్యింది అని చెబుతుండ‌గా..ఇంత‌లో బ‌న్నీ ప్రెసిడెంట్‌(మా నూత‌న అధ్య‌క్షుడు మంచు విష్ణు)గారి అక్క అవ‌డం కూడా అయిపోయింది అంటూ మ‌రో పంచ్ విసిరాడు. దానికి అమ్మో అమ్మో అమ్మ‌మ్మో అంటూ ల‌క్ష్మీ త‌ల ప‌ట్టుకుని ఈ ప్రెసిడెంట్ అక్కకి చాలా క‌ష్టాలొచ్చాయి అంటూ రిప్ల‌య్ ఇచ్చింది. మొత్తానికి బ‌న్నీ మాత్రం మంచు ల‌క్ష్మిని ఓ ఆటాడేసుకున్నాడు.

Share post:

Popular