అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్..!

టాలీవుడ్ లో వరుస విజయాలతో అల్లుఅర్జున్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీ కెరీర్ మాంచి పీక్ స్టేజ్ లో ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన అల వైకుంఠ పురములో సినిమా సంచలన విజయం తర్వాత ఆయన ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా ద్వారా బన్నీ కి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలోని పాటలకు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్టెప్పులేశారు. దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా నటించిన పలు సినిమాలు యూట్యూబ్ లో డబ్ అయి మిలియన్ల కొద్దీ వ్యూస్ తెచ్చుకున్నాయి. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలకు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది.

అది దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ తన తదుపరి సినిమా పుష్పను పాన్ ఇండియా స్థాయిలో అయిదు భాషల్లో విడుదల చేస్తున్నాడు. పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ అనే సినిమాలో అల్లు అర్జున్ నటించనున్నాడు. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందో లేదో సందేహంగా ఉంది.

కాగా బాలీవుడ్ లో అల్లు అర్జున్ ఒక స్ట్రైట్ సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ పతాకంపై జెర్సీ మూవీ ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. హిందీ జెర్సీ డిసెంబర్ 31 న విడుదల కానుంది. జెర్సీ విడుదల తర్వాత అల్లు అర్జున్ షాహిద్ కపూర్ హీరోలుగా ఒక మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు.. సినిమా ప్రారంభమయ్యేది ఎప్పుడూ ..అనే విషయాలు అధికార ప్రకటన ద్వారా తెలియాల్సి ఉంది.

Share post:

Latest