నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక సినిమా రానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చిన సంగతి తెలిసిందే.
కాగా బాలయ్య సినిమాలు అంటే పక్కా మాస్ చిత్రాలుగా తెరకెక్కుతుంటాయి. అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ టచ్ తో పాటు యాక్షన్ అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. అయితే అనిల్ రావిపూడి బాలకృష్ణతో చేసే సినిమా పూర్తి ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలుస్తోంది. దాంతో పాటు బాలయ్య మేనరిజమ్స్ తో పాటు యాక్షన్ ఘట్టాలు కూడా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సినిమాలో ఇది వరకు చూడనటువంటి బాలయ్యను సరికొత్తగా ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్ తో ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఈ మూవీ పూర్తవగానే బాలకృష్ణ సినిమాకు సంబంధించి స్క్రిప్టు వర్కు పూర్తి చేసి.. జూలై నుంచి బాలకృష్ణ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.