ఇలియానాతో ప‌వ‌న్ గొడ‌వ‌.. వీరిద్ద‌రికీ ఎక్కడ చెడిందో తెలుసా?

గోవా బ్యూటీ ఇలియానాతో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అస్స‌లు ప‌డ‌దు. అందుకు వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన గొడ‌వే కార‌ణం. అస‌లు ఆ గొడ‌వేంటి..? వీరిద్ద‌రికీ ఎక్క‌డ చెడిందీ..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. `దేవ‌దాసు` సినిమాతో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ ఇలియానా.. ఆ త‌ర్వాత `పోకిరి` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది.

Vakeel Saab: Is Ileana D'Cruz the Lead Heroine in Pawan Kalyan Starrer? |  ? LatestLY

పోకిరి హిట్ అనంత‌రం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ఇలియానా.. వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపింది. ఈ క్ర‌మంలోనే ప‌వన్ క‌ళ్యాణ్‌తోనూ జ‌త క‌ట్టిందీ బ్యూటీ. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన ఏకైక చిత్రం `జ‌ల్సా`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం 2008వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన విడుదలై సూప‌ర్ హిట్‌గా నిలిచింది.

Ileana And Pawan Kalyan Telugu Movies News

గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ మూవీకి దేవిశ్రీ ప్ర‌సాద్ అందించిన సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అలాగే అప్పటికి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యథిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా జల్సా రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో ప‌వ‌న్‌-ఇలియానాల కెమిస్ట్రీ సైతం ప్రేక్ష‌కుల‌ను అద్భుతంగా ఆక‌ట్టుకుంది. కానీ, ఈ సినిమా త‌ర్వాత వీరిద్ద‌రూ మ‌రోసారి జోడీ క‌ట్ట‌లేదు.

Pin on Telugu Movies

అందుకు కార‌ణం వీరి మ‌ద్య జ‌రిగిన గొడ‌వే. జ‌ల్సా షూటింగ్ స‌మ‌యంలో ఒక సన్నివేశం గురించి ప‌వ‌న్‌- ఇలియానాలు తీవ్ర స్థాయిలో గొడ‌వ ప‌డ్డార‌ట‌. దాంతో ఇలియానా సినిమా నుంచి త‌ప్పుకోవ‌డానికి కూడా సిద్ధ‌మైంద‌ట‌. కానీ, ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెకు సర్దిచెప్పి.. సినిమాని పూర్తి చేసి మంచి విజ‌యాన్ని అందుకున్నారు. కానీ.. ప‌వ‌న్‌, ఇలియానాలు మాత్రం త‌మ మ‌ధ్య జ‌రిగిన గొడ‌వ ద‌గ్గ‌ర నుంచీ మాట్లాడుకోవ‌డం మానేశార‌ట‌. ఇక‌ అందు వ‌ల్ల‌నే, వీరిద్ద‌రి కాంబోలో మ‌రో సినిమా రాలేద‌ని అంటుంటారు.