ఎన్టీఆర్‌కు ఆహ్వానం పంపిన బాల‌య్య‌..దేనికో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు ఆయ‌న బాబాయ్‌, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఆహ్వానం పంపారు. ఇప్పుడు ఆహ్వానం ఏంటీ..? అస‌లు దేనికి ఆహ్వానం పంపారు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

Balakrishna, Jr NTR not approached for Kangana Ranaut's Thalaivi: report -  Hindustan Times

బాల‌కృష్ణ ముచ్చ‌ట ప‌డి మూడోసారి మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. సీనియ‌ర్ స్టార్ హీరో శ్రీ‌కాంత్ భ‌యంక‌ర‌మైన విల‌న్ పాత్ర పోషించాడు.

Akhanda (BB3) Cast, Release Date, Budget, Actress Name – BollyTrendz

ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌.. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను వైజాగ్ లో అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించ‌బోతున్నారు. ఇందుకోసం శ్రేయాస్ మీడియా వారితో ఒప్పందం కుదుర్చుకోగా.. ఇప్ప‌టికే వారు వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏర్ప‌ట్ల‌ను స్టార్ట్ చేసేశారు.

Ahead of Nandamuri Balakrishna's birthday, Akhanda makers unveil new poster  | Entertainment News,The Indian Express

అయితే ఈ ఈవెంట్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా రావాల‌ని బాల‌య్య ఎన్టీఆర్‌ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించార‌ట‌. స్వ‌యంగా బాబాయ్ పిల‌వ‌డంతో.. తార‌క్ వెంట‌నే ఓకే చెప్పాడ‌ని తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌తో పాటు మ‌రో స్టార్ హీరో కూడా హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం. ఏదేమైనా ఎన్టీఆర్ వైజాగ్ వ‌స్తే.. అభిమానుల‌కు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కు క‌న్నుల పండ‌గే అవుతుంది.

Share post:

Popular