`అఖండ‌` టీమ్‌ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్‌..నిరాశ‌లో బాల‌య్య ఫ్యాన్స్‌?

November 20, 2021 at 2:06 pm

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టించ‌గా.. శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Akhanda trailer: Nandamuri Balakrishna turns messiah once again, delivers  punchlines a la Balayya style | Entertainment News,The Indian Express

డిసెంబ‌ర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తి అయ్యాయి. అయితే విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్న మేక‌ర్స్‌.. అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏపీలో వైజాగ్ వేదిక‌గా ఈ నెల 27వ తేదీన గానీ .. 28వ తేదీన గానీ అంగరంగ వైభ‌వంగా నిర్వ‌హించాల‌ని ప్లాన్లు వేశారు. ఇందులో భాగంగానే శ్రేయాస్ మీడియా వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

Watch Akhanda Trailer: Nandamuri Balakrishna AKA Balayya's Movie Guarantees  To Be Energy-Packed Mass Entertainer (Watch Video) - Google Movie News  Youtube HD Video - Latest Breaking News

కానీ, ప్ర‌స్తుతం వైజాగ్‌లో భారీ వర్షాల కార‌ణంగా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గినప్పటికీ .. ఆ ప్రభావం నుంచి వాళ్లు బయటపడటానికి కొంత సమయం పడుతుంది. ఈ నేప‌థ్యంలోనే అఖండ మేక‌ర్స్ మ‌న‌సు మార్చుకుని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులోనే శిల్పకళావేదికలో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.

Akhanda Movie Release date Dec. 2021 | Earning, Director, Actors

ఇక‌ త్వరలోనే దీనిపై స్పష్టత కూడా రానుంది. అయితే `అఖండ‌` ప్రీ రిలీజ్ ఈవెంట్ విష‌యంలో చిత్ర‌ టీమ్ వేసుకున్న‌ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయ్యాయ‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. బాల‌య్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌వుతున్నారు.

 

`అఖండ‌` టీమ్‌ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్‌..నిరాశ‌లో బాల‌య్య ఫ్యాన్స్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts