వైజాగ్ లో పీకే టీమ్ సర్వే..విజయసాయికి వ్యతిరేక పవనాలు

గత ఎన్నికల ముందు జగన్ పార్టీకి అన్నీ తానై నడిపిన ప్రశాంత్ కిశోర్ ఈసారి కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కాకపోయినా వైసీపీ కోరిక మేరకు ఈ ఎన్నికలకు కూడా పీకే పనిచేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వైజాగ్ పై పీకే టీమ్ కాన్సంట్రేట్ చేసింది. అక్కడ ప్రాథమికంగా సర్వే చేసినట్లు సమాచారం. ఈ సర్వేలో వైసీపీ నేతలు.. ముఖ్యంగా స్థానిక నాయకుడు, పార్టీ సీనియర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి షాకయ్యే రిజల్ట్స్ వచ్చాయట. ఆయనపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు పీకే టీం గుర్తించింది. అమరావతి నుంచి వైజాగ్ కు రాజధానిని మార్చుతారని ప్రభుత్వం చెప్పినప్పటి నుంచి విశాఖలో విజయసాయి దాదాపు సమాంతర ప్రభుత్వం నడిపినట్లు పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. వైజాగ్ లో ఏది జరిగినా ఆయన కనుసన్నల్లోనే జరుతున్నట్లు ఆరోపణలున్నాయి. పలువురు పార్టీ నాయకులు జగన్ చెవిన ఈ విషయాలు వేశారని కూడా తెలిసింది. అయితే పార్టీ చీఫ్, సీఎం జగన్ మాత్రం వేచి చూద్దాం అనే ధోరణిలో ఉన్నట్లున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

- Advertisement -

ప్రశాంత్ కిశోర్ టీమ్ మాత్రం రాజకీయాలను పట్టించుకోకుండా కిందిస్థాయి నుంచి సర్వేలు చేయడం ప్రారంభించింది. మొత్తం సమాచారాన్ని సేకరించి పూర్తి నివేదిక రూపొందించి వైసీపీ అధ్యక్షుడు జగన్ కు అందజేయనున్నట్లు సమాచారం. ఆ నివేదిక బట్టే ఏం చేయాలనే విషయం పార్టీ ఆలోచిస్తుంది. వైజాగ్ పై ద్రుష్టి సారించిన పీకే టీమ్ ఆ తరువాత.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో సర్వే చేయనున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఏపీలో మళ్లీ పీకేటీమ్ యాక్టివ్ అయిందంటే.. రాజకీయ వేడి రాజుకున్నట్లే..

Share post:

Popular