ఈ రోజు రజినీకాంత్‌కి వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌..ఎందుకో తెలుసా?

నాలుగు దశాబ్దాలుగా అత్యుత్తమమైన, విజయవంతమైన న‌టుడిగా దూసుకుపోతున్న సౌత్ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ గురించి కొత్త ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఏడు ప‌దుల వ‌య‌సులోనూ ఇంకా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్న ర‌జినీకాంత్‌కి.. ఈ రోజు వెర్రీ వెర్రీ స్పెష‌ల్‌.

Court summons Rajinikanth over controversial statement in Sterlite factory protest case

ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా తెలిపారు. `ఈ రోజు నా జీవితంలో చాలా స్పెష‌ల్‌. ఎందుకంటే, నేడు రెండు ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. అందులో ఒక‌టి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకోవడం. ప్రజల ప్రేమ.. మద్దతు కారణంగానే నాకు భారత ప్రభుత్వం ఈ అవార్డ్ ప్రదానం చేస్తుంది.

soundarya rajinikanth twitter online

అలాగే రెండోవ‌ది నా కుమార్తె సౌందర్య విఘ్నేశ్‌ ఎంతో శ్రమించి సిద్ధం చేసిన `హూట్‌ యాప్‌`ని తాను నేడు విడుదల చేయబోతున్నాను` అంటూ ర‌జినీ సోష‌ల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. కాగా, ర‌జినీ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇప్పటివరకు 168 చిత్రాల్లో న‌టించిన ఆయ‌న 168వ చిత్రంగా `అన్నాత్తే`ను చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌వంబ‌ర్ 4న విడుద‌ల కాబోతోంది.