ఆ విషయంలో మాకు తోడుగా సల్మాన్ ఉంటాడు అంటున్న షారుఖ్ ఖాన్?

October 8, 2021 at 8:32 pm

గత నాలు గైదు రోజులుగా సోషల్ మీడియా లో ఆర్యన్ ఖాన్ పేరు మార్మోగిపోతోంది. బాలీవుడ్ తో పాటు తన ఇండస్ట్రీలలో కూడా ఆర్యన్ డ్రగ్స్ కేసు కి సంబంధించిన విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆర్యన్ ఖాన్ కి, అలాగే షారుఖ్ ఖాన్ కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలిచారు. ఇక షారుఖ్ అభిమానులు చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ మద్దతును తెలిపారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ విషయంపై ఏకంగా ఇంటికి వెళ్లి మరి షారుక్ ఖాన్ తో మాట్లాడారు.

ఈ నేపథ్యంలోనే తమ ఫ్యామిలీ సమస్యల్లో ఉన్నప్పుడు సల్మాన్ ఖాన్ సపోర్ట్ గా నిలుస్తారని షారుఖ్ ఖాన్ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఆ వీడియోలో సల్మాన్ పోస్ట్ చేసిన దస్ కా దమ్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో, రాణి ముఖర్జీ తో కలసి గెస్ట్ గా పాల్గొన్నారు. ఆ షోలో హోస్ట్ సల్మాన్ ఖాన్ మీరు సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరి మీకు తోడుగా నిలుస్తారు? అని షారుక్ ఖాన్ ని అడిగాడు.

దానికి బదులుగా సల్మాన్ ఖాన్ నేను నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు నువ్వు కచ్చితంగా నాతో ఉంటావు అని తెలిపాడు. దీనికి అవునంటూ సల్మాన్ తలూపాడు. అనంతరం ఎమోషనల్ అయినా ఇద్దరూ ఒక్కసారిగా హగ్ చేసుకున్నారు. ఆర్యన్ డ్రగ్స్ కేసు విషయంలో షారుక్ ఖాన్ ని సల్మాన్ ఖాన్ పరామర్శించడం తో తమ అభిమాన హీరో మాట నిలబెట్టుకున్నాడు అంటూ ఫ్యాన్స్ ఇంస్టాగ్రామ్ లో పాత వీడియో ని షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ విషయంలో మాకు తోడుగా సల్మాన్ ఉంటాడు అంటున్న షారుఖ్ ఖాన్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts