మొన్న చైతు..ఇప్పుడు నాని..సాయి ప‌ల్ల‌విని భ‌లే వాడుకుంటున్నారుగా!

సాయి ప‌ల్ల‌వి.. మంచి న‌టినే కాదు అద్భుత‌మైన డ్యాన్స‌ర్ కూడా. ఆమె కాలు క‌దిపిందంటే ఫిదా కాని ప్రేక్ష‌కుడు ఉండ‌డు. అందుకే సాయి ప‌ల్ల‌వి న‌టించే ప్ర‌తి సినిమాలోనూ.. ఆమెకో స్పెష‌ల్ సాంగ్ ఉంటుంది. ఇక మొన్నీ మ‌ధ్య విడుద‌లైన `ల‌వ్ స్టోరీ` చిత్రంలోనూ సాయి ప‌ల్ల‌వి చేసిన `సారంగద‌రియా .. ` సాంగ్ యూట్యూబ్‌లో ఎన్ని రికార్డులు నెల‌కొల్పిందో, చైతు ఖాతాలో మ‌రో హిట్ ప‌డ‌టానికి ఎంత ప్ల‌స్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

SarangaDariya​ | Love story Songs | Naga Chaitanya | Sai Pallavi | Sekhar Kammula | Pawan Ch - YouTube

అయితే ఇప్పుడు సాయి ప‌ల్ల‌వికి ఉన్న డ్యాన్స్ టాలెంట్‌ను న్యాచుర‌ల్ స్టార్ నాని కూడా వాడేసుకుంటున్నార‌ట‌. అస‌లు విష‌యం ఏంటంటే.. నాని ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగ‌రాయ్‌` ఒక‌టి. కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి,కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Shyam Singha Roy latest update: Sai Pallavi looks ethereal in FIRST LOOK poster of Shyam Singha Roy; Co-star Nani pens heartfelt birthday wish

అయితే ఈ మూవీలోనూ సాయి పల్లవిపై డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాయన్ ఓ స్పషల్ సాంగ్ డిజైన్ చేశార‌ట‌. ఇప్ప‌టికే షూటింగ్ కూడా పూర్తైంద‌ట‌. దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాగే ఈ సాంగ్‌లో సాయిపల్లవి క్లాసికల్ డాన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సాంగ్ ప్ర‌తి ప్రేక్ష‌కుడికి న‌చ్చుతుంద‌ని.. మ‌రియు సినిమాకే హైలైట్ అవుతుంద‌ని అంటున్నారు. కాగా, భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రం క్రిస్మస్ కానుక‌గా డిసెంబర్ 24న విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

Share post:

Latest