మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు పూర్తై వారం రోజులు గడిచిపోయింది. ప్రకాష్ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించడం, ప్రమాణస్వీకారం చేయడం కూడా పూర్తైంది. కానీ, మాలో రచ్చ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని ఆరోపణలు చేశారు ప్రకాశ్ రాజ్. అంతేకాదు ఎన్నికల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులందరూ రాజీనామాలు కూడా చేశారు.
ఇక తాజా పరిణామాలను చూస్తుంటే ‘మా’ వార్ ఇంకా ముగియలేదని స్పష్టంగా అర్థం అవుతోంది. ఇదిలా ఉంటే.. సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ.. `మా` ఎన్నికలపై తనదైన స్టైల్‌లో షాకింగ్ ట్వీట్ చేశారు.
మా మొత్తం ఎపిసోడ్ సర్కస్‌లా ఉందని, సిని`మా` వాళ్లు సర్కస్ లాంటి వాళ్లని ప్రజలకి నిరూపించారంటూ సెటైరికల్ కామెంట్లు చేశారు. దాంతో ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలోనే వర్మకు కొందరు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు. అంతేకాదు, `లేటైనా `మా` సభ్యులకు వర్మ ఘాటుగానే ఇచ్చే పడేశాడని` నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Cine”MAA”people proved to the audience, that they are actually a CIRCUS 😳😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) October 16, 2021