మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. అక్టోబర్ 10న ఎన్నికలు జరగబోతుండగా.. ఒకవైపు ప్రకాశ్ రాజ్ వర్గం, మరొకవైపు మంచు విష్ణు వర్గం హోరా హోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతున్నారు.
మొత్తానికి రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్న మా ఎన్నికల్లో..గెలిచేది ఎవరు అన్నది సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఇలాంటి తరుణంలో సీనియర్ హీరోయిన్, వైఎస్ఆర్‌సీనీ ఎమ్మెల్యే ఆర్కే.రోజా మా ఎన్నికలపై స్పందించారు. తాజాగా ఆమె మట్లాడుతూ.. మా ఎన్నికల్లో తాను తప్పకుండా ఓటు వేస్తానని స్పష్టం చేశారు.
అలాగు ఎన్నికల్లో రెండు ప్యానెల్స్ వారి మేనిఫెస్టోని విడుదల చేశాయి. అయితే ఆర్టిస్టులకు ఉపగయోగపడే మేనిఫెస్టోకే నేను ఓటు వేస్తానని ఆమె తెలిపారు. అంతేకాదు మా ఎన్నికలు రాజకీయ ఎన్నికలకల్లా వాడి వేడిగా జరుగుతున్నాయన్న రోజా.. అందులో ఎక్కువ ఇన్‌వాల్వ్ అవ్వనని ఓపెన్‌గానే చెప్పేశారు.