సమంత విషయంలో అభిమాని కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆషురెడ్డి?

సోషల్ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫాలోయింగ్ మాములుగా లేదు. బిగ్ బాస్ సీజన్ 3 తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంత గా క్రేజు తెచ్చుకుంది ఈ అమ్మడు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ.

ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తాజాగా నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం గురించి ఎంత చదువుకున్న మనందరికీ తెలిసిందే. ఈ విడాకుల తరువాత ఎన్నో కథనాలు, ఊహాగానాలు, పుకార్లు పుట్టుకొచ్చాయి.తాజాగా అషురెడ్డిఅభిమానికి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది అషూరెడ్డి తన ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తన అభిమానులతో పంచుకుంది. స్టాప్‌ అండే స్టేర్‌ బికాస్‌ అయామ్‌ రేర్‌ అంటూ పోస్ట్‌ చేసిన ఆ ఫొటోకు అభిమానులు అందరూ లైక్‌లు కొడుతూ కామెంట్లు పెడుతూ స్పందించారు.

అందులో ఒక అభిమాని ‘అషూ మీరు సమంతలాగే ఉన్నారు మ్యారేజ్‌ విషయంలో మాత్రం సమంతలాగా చేయొద్దు’ అని కామెంట్‌ చేశాడు. ఆ కామెంట్‌కు అషూరెడ్డి స్పందించింది. ‘మీకు కథలో మరో కోణం గురించి తెలియదు. ఎప్పుడూ వేరొకరి జీవితాల గురించి మాట్లాడొద్దు’ అంటూ అషూరెడ్డి గట్టిగానే కౌంటర్‌ ఇచ్చింది. జూనియర్‌ సమంత అని పేరు తెచ్చుకోవడమే కాదు.. సమంతకు సపోర్ట్‌ ఇవ్వడంలో కూడా అషూరెడ్డి ముందుంది అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.