రమ్యకృష్ణ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో అగ్ర హీరోయిన్గా కొన్నేళ్ల పాటు చక్రం తిప్పిన రమ్యకృష్ణ.. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. అయితే ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను అనుభవిస్తున్న రమ్యకృష్ణ.. కెరీర్ మొదట్లో సరైన హిట్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. ఎందరి చేతనో విమర్శల పాలైంది.
ఆమె నటిస్తే సినిమా ఫ్లాపే అని..ఐరన్ లెగ్ అని ముద్ర కూడా వేయించుకుంది. దాంతో ఇక రమ్యకృష్ణ కెరీర్ క్లోజ్ అని అందరూ అనుకున్నారు. అలాంటి సమయంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆమెను ఆదుకుని మళ్లీ లైఫ్ ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1980లలోనే హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన రమ్యకృష్ణ.. అందం, అభినయం ఉన్నా సక్సెస్ కాలేకపోయింది.
ఈ క్రమంలోనే దర్శకనిర్మాతలను ఆమెను పక్కన పెట్టడం ప్రారంభించారు. అలాంటి తరుణంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు అల్లుడుగారు చిత్రంలో అవకాశం ఇచ్చి, నిన్ను కాదు అనుకున్న వాళ్లు నిన్నే కావాలి అనుకునేలా చేస్తానని మాట ఇచ్చారట. ఇక అనుకున్నట్టే అల్లుడుగారు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. రమ్యకృష్ణకు సూపర్ క్రేజ్ దక్కిందట. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు రావడం, స్టార్ హీరోయిన్గా ఎదగడం చకచకా జరిగాయి.