ప్రాజెక్ట్ కే.. సైన్స్ ఫిక్షన్ కథ కాదా.. మరి ఈ ట్విస్ట్ ఏంటీ..!

October 14, 2021 at 12:02 pm

బాహుబలి తో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ తో దేశంలో ఏ హీరో కానంత బిజీగా మారిపోయాడు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ పూర్తి చేసిన ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలను సమాంతరంగా పూర్తి చేసుకున్నాడు. రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ప్రాజెక్ట్ కే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. దేశంలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇదివరకే ప్రకటించాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ కథ కి పోలీసాఫీసర్ కథకి సంబంధం ఏంటని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు. పోలీస్ ఆఫీసర్ కథ అంటే రొటీన్ సినిమాగా మారి పోతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు.

ప్రాజెక్ట్ కే సినిమా గురించి గతంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ఇది వరకు ఇటువంటి కథతో ఏ సినిమా రాలేదని.. ఇది ఒక అద్భుతమైన ప్రయోగం..అని తెలిపాడు. దానికితోడు తమ సినిమా పాన్ ఇండియా సినిమా కాదని..పాన్ వరల్డ్ సినిమా అని ప్రకటించాడు. ఎంతో గొప్ప కథతో తెరకెక్కుతున్న సినిమాగా ప్రాజెక్టు కే ప్రచారం రాగా..ఇప్పుడేమో ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తుండడంతో ఇది ఏ తరహా సినిమానో అర్థం కాక ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు.

ప్రాజెక్ట్ కే.. సైన్స్ ఫిక్షన్ కథ కాదా.. మరి ఈ ట్విస్ట్ ఏంటీ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts