క్రిస్మస్ టూ సంక్రాంతి.. బ్యాక్ టూ బ్యాక్ విడుద‌ల‌య్యే సినిమాలు ఇవే!

తెలుగు ప్రేక్ష‌కుల‌కు సినీ పండ‌గ రాబోతోంది. మాయ‌దారి క‌రోనా వైర‌స్ కార‌ణంగా విడుద‌ల వాయిదా ప‌డ్డ చిత్రాలు, షూటింగ్‌లో వెన‌క‌ప‌డిన చిత్రాల‌న్నీ విడుద‌ల‌కు సిద్ధం అవుతున్నాయి. ఈ సారి క్రిస్మ‌స్ మొద‌లు సంక్రాంతి వ‌ర‌కు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు విడుద‌ల కాబోతున్నాయి. మ‌రి లేటెందుకు క్రిస్మస్ టూ సంక్రాంతికి రిలీజ్ కాబోయే చిత్రాల‌పై ఓ లుక్కేసేయండి.

Allu Arjun's Telugu film 'Pushpa' to release in two parts

పుష్ప‌: అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెర‌కెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను `పుష్ప ది రైస్` పేరుతో క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 17 న విడుద‌ల చేయ‌బోతున్నారు.

S S Rajamouli's 'RRR' gets a new release date; to hit theatres in January 2022! | Hindi Movie News - Times of India

ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం): యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం జనవరి 7, 2022 సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కాబోతోంది.

Sarkaru Vaari Paata first notice: Mahesh Babu looks stylish in first look, movie to release on January 13 | Entertainment News,The Indian Express

స‌ర్కారు వారి పాట‌: పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టించిన ఈ మూవీ వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 13న రిలీజ్ కాబోతోంది.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment News,The Indian Express

రాధేశ్యామ్‌: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న గ్రాండ్ రిలీజ్ అవ్వబోతోంది.

Ayyappanum Koshiyum' Telugu remake titled 'Bheemla Nayak'; teaser released - The Week

భీమ్లా నాయ‌క్‌: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న ఈ మూవీకి సాగ‌ర్ కె. చంద్ర దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే ఈ చిత్రం 2022, జ‌న‌వ‌రి 12న విడుద‌ల కాబోతోంది.

Thalapathy 65 first look / Vijay's 'Beast' poster: Vijay's film with Nelson Dhilipkumar titled 'Beast'

బీస్ట్: కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ థ‌ళ‌ప‌తి, నెల్స‌న్ దిలీప్ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ రూపొందుతుండ‌గా.. వ‌చ్చే ఏడాది సంక్రాంతికే రిలీజ్ అవ్వ‌నుంది.

F3 Movie Sankranthi Wishes Poster - IndustryHit.Com

ఇక వీటితో పాటు నాగార్జున‌-నాగ‌చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న బంగార్రాజు, వెంక‌టేష్‌-వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న ఎఫ్ 3 చిత్రాలు సైతం సంక్రాంతి బ‌రిలోనే దిగ‌బోతున్నాయి.

Share post:

Latest