`ఆహా` షోకి బాల‌య్య రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది?!

ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహా లో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే` అనే ఓ టాక్ షోకు టాలీవుడ్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య మొట్టమొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ఈ టాక్ షో.. దీపావళి సంబదర్భంగా నవంబర్ 4వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతోంది.

ఈ షోలో బాల‌య్య సినీ ప్ర‌ముఖుల‌ను త‌న‌దైన శైలిలో ఇంట‌ర్వ్యూ చేయ‌బోతున్నాడు. అయితే ఈ షోకు బాల‌య్య పుచ్చుకునే రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా 40 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.

NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR: చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ బాటలో స్మాల్ స్క్రీన్ పై బాలకృష్ణ సందడి.. | NBK - Chiranjeevi - Nagarjuna - Jr NTR Balakrishna Nandamuri Talk Show In Aha

ప‌న్నెండు ఎపిసోడ్స్‌తో తొలి సీజన్ ముగుస్తుందని ప్రచారం జరుగుతుంది. అంటే ఈ లెక్కన దాదాపు రూ.6 కోట్ల వరకు బాల‌య్య రెమ్యూన‌రేష‌న్ ఉంటుంద‌ని అంటున్నారు. కాగా, బాల‌య్య సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఆయ‌న బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` సినిమా చేస్తున్నారు. ఇది పూర్తి కాగానే గోపీచంద్ మాలినేనితో బాల‌య్య ఓ సినిమా చేయ‌నున్నాడు.