అనసూయ ఓటమిపై.. అనసూయ షాకింగ్ ట్విట్ వైరల్..!

టాలీవుడ్ లో హాట్ యాంకర్ గా పేరు పొందింది అనసూయ భరద్వాజ్. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఇక అనసూయ ఈ మధ్య కాలంలో వరుస సినిమాలలో బిజీ గా ఉంటోంది. అయితే తాజాగా చలన చిత్ర పరిశ్రమలో ఎంతో అట్టహాసంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా జరిగినటువంటి “మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ “ఎన్నికల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తరుపున ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోటీ చేసింది అనసూయ.

- Advertisement -

అయితే మొన్న ఆదివారం ఫలితాల రోజు అనసూయ బారి మెజారిటీతో విజయం సాధించేసింది అని కన్ఫామ్ కూడా చేసేశారు.మళ్లీ ఒకరోజు గడిచేసరికి ఆమె మళ్లీ ఓటమి పాలైందని ప్రకటన రావడంతో అనసూయ ఒక పోస్టుని చేసింది.

“క్షమించాలి.. ఈ ఒక్క విషయం గుర్తు చేస్తే నాకు తెగ నవ్వు వచేస్తోంది. అందుకోసమే నేను మీతో పంచుకుంటున్నాను ఏమనుకోవద్దు.. నిన్నేమో భారీ మెజార్టీ,అత్యధిక మెజార్టీ అని చెప్పి.. ఈరోజు ఓడిపోయిందని తెలియజేశారు. రాత్రికి రాత్రి ఏం జరిగిందో అబ్బా అంటూ ట్విట్ చేసింది అనసూయ. అసలు సుమారుగా 900 వందల ఓట్లు ఉంటే.. అందులో 600 చిల్లర ఓట్లు లెక్కింపు నకు రెండో రోజు వాయిదా వేయాల్సిన అవసరం ఏంటి? ఆహా అర్థం కాక అడుగుతున్నానని” తన ఓటమిపై మరొక రకమైన స్పందన చేస్తోంది అనసూయ.

Share post:

Popular