శంకర్ సినిమాలో రామ్ చరణ్ నటించడానికి అన్ని కోట్లు డిమాండ్ చేశాడ..?

మెగా స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో లో ఒక సినిమా రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా ఆన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ శంకర్. ఇక ఈ సినిమాలో ఎంతోమంది టాలీవుడ్ లో ఉన్న నటులు నటిస్తుండడం విశేషం.

అయితే ఈ సినిమాపై ఎన్నో భారీ అంచనాలు పెట్టుకున్నారు రామ్చరణ్ అభిమానులు. ఇక ఈ సినిమా బడ్జెట్ విషయానికొస్తే దాదాపుగా 250 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ ఈ సినిమాకి దాదాపుగా 70 కోట్ల రూపాయలను తీసుకోబోతున్నట్లు గా సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ విషయం బాగా వైరల్ గా మారుతుంది.

ఇక ఇదే నిజమైతే ప్రస్తుతం ప్రభాస్ తర్వాత అత్యధిక పారితోషకం తీసుకుంటున్న వారిలో రామ్ చరణ్ ఉంటాడు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కియారాఅద్వానీ నటిస్తుంది.అలాగే ఈ సినిమాని దిల్ రాజు బ్యానర్ పై 50వ చిత్రం గా తెరకెక్కిస్తున్నారు.