విఘ్నేష్ తో కలసి తిరుపతి కి వెళ్ళిన నయన్.. అందుకేనా..?

September 27, 2021 at 6:28 pm

టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకకి పెట్టింది పేరు నయనతార. కొన్ని సంవత్సరాల నుంచి విఘ్నేష్ అనే నిర్మాతతో ప్రేమలో ఉన్నది. వీళ్ళు ఇద్దరు కలిసి తిరుమలకు వెళ్లి దర్శించుకున్నట్లు సమాచారం.కొద్ది రోజుల నుంచి ఎక్కడికి వెళ్లిన జంటగానే దర్శనమిస్తున్నారు.వీళ్ళిద్దరికి పెళ్లి సంబంధం ముహూర్తం ఖరారైంది అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు.

వీరి పెళ్లికి సంబంధించి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్లు సమాచారం. ఇక వీరి పెళ్లికి ఇరువురు కుటుంబాల అంగీకారంతోనే జరగనున్నట్లు సమాచారం. ఇక వీరి పెళ్లి కోవిడ్ రూల్స్ ను పాటిస్తూ చేసుకోబోతున్నట్లు గా సమాచారం.ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభం అయినట్లు సమాచారం. అందులో భాగంగానే వీరిద్దరూ కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చినట్లు సమాచారం.

అంతే కాకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ వివాహం జరగాలని దేవుని దర్శించుకున్నట్లుగా సమాచారం.ఆమె పెళ్లికి గద్వాల్ చీరతోపాటు కంచి పట్టు చీరలు కూడా డిజైన్లు రెడీ చేస్తున్నట్లు గా సమాచారం. పెళ్లి కూడా తిరుమలలో జరిగే అవకాశాలు ఉన్నట్లు గా సమాచారం.

విఘ్నేష్ తో కలసి తిరుపతి కి వెళ్ళిన నయన్.. అందుకేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts