అఫీషియల్ : ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బాక్సింగ్ గాడ్..ఏ సినిమాలో నటిస్తున్నాడంటే..!

September 27, 2021 at 6:01 pm

యంగ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరోహీరోయిన్లుగా పూరీ  జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఈ సినిమాను పూరీ  జగన్నాథ్, చార్మీ , కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలసి నిర్మిస్తున్నారు. కాగా రేపు పూరీ  జగన్నాథ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ఒ క సర్ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో బాక్సింగ్ గాడ్ మైక్ టైసన్ నటించనున్నట్లు అఫీషియల్ గా  ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్, స్మాల్ వీడియో కూడా విడుదల చేశారు. ఇందుకు సంబంధించి విజయ్ దేవరకొండ ట్వీట్ కూడా చేశాడు.

‘మీకు పిచ్చెక్కిస్తామని హామీ ఇచ్చాం. అది ఇప్పుడు మొదలు కాబోతోంది. ఇండియన్ స్క్రీన్ పై తొలిసారి టైసన్ కనిపించబోతున్నాడు. ద బ్యాడెస్ట్ మ్యాన్ ఆన్ ప్లానెట్, గాడ్ ఆఫ్ బాక్సింగ్, వన్ అండ్ ఓన్లీ లెజెండ్, దీ బీస్ట్.. టైసన్ ‘ అని విజయ్ ట్వీట్ చేశాడు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం కలిగిన పాత్రలో టైసన్ కనిపించబోతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం లైగర్ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. దర్శకుడు పూరీ  జగన్నాథ్ కొన్ని యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. థాయిలాండ్ స్టంట్ డైరెక్టర్ కెచ్చా యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే లైగర్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉండగా మైక్ టైసన్ కూడా ఈ సినిమాలో భాగం కావడం తో ఇవి మరింత పెరిగాయి.

అఫీషియల్ : ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై బాక్సింగ్ గాడ్..ఏ సినిమాలో నటిస్తున్నాడంటే..!
0 votes, 0.00 avg. rating (0% score)